పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరుమండలం, మిగతా అన్ని మండలాల్లో బాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్టూరి మెడికల్ కాలేజీ భాగస్వామ్యంతో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారు…
బాష్యం ప్రవీణ్ కామెంట్స్..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనిషి కి ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వారికీ ఎంత డబ్బు ఉన్న నిరూపయోగమే అన్నారు..నియోజకవర్గం లోని ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తున్నామన్నారు…
ఈ క్యాంప్ లో ప్రతీ మనిషికి అవసరమయిన జెనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, కంటికి సంబందించిన మరియు ప్రసుతి వంటి అన్ని సేవలు అందిస్తున్నామన్నారు..
ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు..
ఈ క్యాంప్ నిర్వహించటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కర్టూరి మెడికల్ కాలేజీ యాజమాన్యానికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు…ఈ క్యాంప్ లో ఈసీజీ,ఎకో,అన్ని రకాల బ్లడ్ టెస్ట్ లు ఫ్రీ గా అందిస్తునారన్నారు నియోజకవర్గం ప్రజలు అవసరం అయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలన్నారు.

