చైనీస్ లోన్ యాప్స్, – 106 కోట్ల మనీ లాండరింగ్
చైనీస్ పౌరులు “నియంత్రిస్తున్న” మొబైల్ ఫోన్ ఆధారిత లోన్ యాప్‌లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా వివిధ చెల్లింపు గేట్‌వే మర్చంట్ ఐడీలు మరియు బ్యాంక్ ఖాతాలలో సుమారు రూ.106 కోట్ల విలువైన నిధులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
మొబైల్ యాప్‌ల ద్వారా చిన్న మొత్తాల లోన్ తీసుకున్న వ్యక్తుల పై “దోపిడీ చేసి వేధించిన అనేక సంస్థలపై బెంగళూరు పోలీసు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ ఈ మనీ-లాండరింగ్ కేసును దాఖలు చేసింది.
ఈ చైనీస్ జాతీయ-నియంత్రిత సంస్థలు Razorpay, Cashfree, Paytm, PayU, Easebuzz వంటి వివిధ గేట్‌వేలతో నిర్వహించబడుతున్న ముర్చెంట్ ఐడి ల ద్వారా భారీ మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డాయి. మర్చంట్ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో పీఎంఎల్‌ఏ కింద రూ.106 కోట్లు అటాచ్ చేశామని ఈడీ తెలిపింది.
ఈ కంపెనీలు వారి ఆఫీసులలో పని చేసే ఉద్యోగుల కెవైసి పత్రాలతో ఉద్యోగులకు తెలియకుండా వారిని కంపెనీ డైరెక్టర్ లుగా మార్చి కంపెనీలను నడిపిస్తున్నాయని ఈడి పేర్కొంది.
వారు లోన్ యాప్‌లు మరియు ఇతర మార్గాల ద్వారా ప్రజలకు తక్షణ స్వల్పకాలిక రుణాలను అందించి, అధిక ప్రాసెసింగ్ ఫీజులు మరియు అధిక వడ్డీ రేట్లు వసూల చేయడమే కాకుండా రుణగ్రహీతలను బెదిరించడం మరియు మానసిక హింసకు గురిచేసి, వారి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులను సంప్రదించి డబ్బు కోసం అడుగుతారు, ”అని ఈడి విచారణలో తెలిపింది..