Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి

  • పోలీస్ యాక్షన్ దండయాత్ర కాదు-
  • ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన.
  • చంద్రబాబు అలసత్వం, నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
  • మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న పవన్ …
  • పూర్తిస్థాయి రాజకీయాలకు పనికిరాడు.
  • హక్కుల సాధనను హర్షించకపోతే ఆంధ్ర ద్రోహులే

సత్తెనపల్లి :

మన భూభాగంలో మన వాట ప్రకారం మన నీటి వినియోగం కోసం చేసిన పోలీసు యాక్షన్ దండయాత్ర ఎలా అవుతుందని,, ఓట్ల రాజకీయమని ఎలా అంటారని ప్రతిపక్షాలను రాష్ట్ర జల వనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు కడిగిపారేశారు. ఇది దండయాత్ర కాదని మన హక్కుల సాధనని, యువనేత జగన్మోహన్ రెడ్డి సాహసి అని, నీటి వినియోగాన్ని గతంలో తెలంగాణకు అప్పగించిన చంద్రబాబు ఆంధ్ర ద్రోహి అని కడిగిపారేశారు.

శనివారం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి అంబటి మాట్లాడుతూ పచ్చ పత్రికలు ఇష్టానుసారంగా రాస్తున్నాయని, పవన్ చంద్రబాబులు ఇప్పటివరకు నోరు మెడపలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల జీవనం కోసం ఆలోచించమని అడుగుతున్నానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జలాల నీటి వినియోగంలో నష్టపోతున్నామన్నారు. శ్రీశైలం డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం విచ్చలవిడిగా నీటిని వాడుకుంటుందన్నారన్నారు. 30 టీఎంసీల వరకు మనకు అవకాశం ఉన్నా ప్రస్తుతం 13 టిఎంసిల వరకే ఉపయోగించుకునే దుస్థితి నెలకొందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు నీటి యాజమాన్యాన్ని తెలంగాణకు అప్పజెప్పడంతోనే ఈ దుస్థితి నెలకొంది అని విమర్శించారు

 

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంకల గుద్దుకునేందుకు సిద్ధంగా ఉండటం ఆ పార్టీ దుస్థితికి, దిగజారి పోవడానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో తెదేపా అదృశ్యం అవుతుందన్నారు.

 

పవన్ కళ్యాణ్ మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడని పూర్తి కాలపు రాజకీయాలకు అనర్హుడన్నారు.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే ఆ పార్టీ ఓడిపోయేందుకు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించిన తెలుగుదేశం పార్టీకి ..ఆంధ్రప్రదేశ్లో ఎలా సహకరిస్తున్నావని, పవన్ నీకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు . పవన్ చంద్రబాబు లది అనైతిక కలయిక అన్నారు. సమ సమాజ స్థాపన కోసం గత పదేళ్లు ఏం చేసావని మంత్రి ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం తో బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి కలిసిపోయారని విమర్శించారు.

 

ఈ సమావేశంలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, పట్టణ వైయస్సార్ సిపి అధ్యక్షులు సహారా మౌలాలి, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కరరెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు నాయక్ , పల్నాడు జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ గజ్జల నాగభూషణ రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, పలువురు నాయకులు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల బాధ్యులు తదితరులున్నారు.

Related posts

Leave a Comment