ఇంటర్ మండల టాపర్ గా ఆయేషా. తనుజ
: ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాల


కనేకల్లు జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12
శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో జూనియర్ కళాశాలకు చెందిన ఆయేషా తనుజ మండల టాపరుగా నిలిచారు. బైపిసి మొదటి సంవత్సరం చదివిన మండల టాపర్ గా అబ్దుల్ రొఫ్ కుమార్తె అయేషా 440 మార్కులకు గాను 412 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. అలాగే రెండవ సంవత్సరం ఇంటర్ చదువుతున్న ఎం పీ సీ మండల టాపరుగా బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన టైలర్ కుబేర కుమార్తె తనుజ 1000 మార్కులకు గాను 927 మార్కుల సాధించి మండల టాపరుగా నిలిచింది.
అలాగే ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మహమ్మద్ కైఫ్ 470 మార్కులకు గాను 440 మార్కుల సాధించాడు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులను ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు సందర్భంగా ప్రిన్సిపల్ ఆంజనేయులు మాట్లాడుతూ. మా కాలేజీలో ప్రధమ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటి సంవత్సరం బైపిసి లో మండల టాపర్ గా అయేషా రావడం. మరియు ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో తనుజ కూడా మండల టాపర్ గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించడం జిల్లాలోనే రెండవ స్థానంలో జూనియర్ కళాశాల ఉండడం మా అధ్యాపకులు మా విద్యార్థులు పడిన శ్రమే అన్నారు.
ఒక కూలి పని చేసుకుంటూ తల్లిదండ్రులు మరోపక్క టైలరింగ్ చేసుకుంటూ తల్లిదండ్రులు ఇంకో పక్క రిపోర్టర్ గా ఉంటూ తల్లిదండ్రులు తమ పిల్లను ప్రభుత్వ కళాశాలలో చేర్పించి ప్రైవేట్ కళాశాలలకు దీటుగా మేలైన ఫలితాలు సాధించి మా కళాశాలకే వన్నె తెచ్చారన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులను కళాశాలకు రప్పించి వారిని అభినందించారు . ఈ సందర్భంగా బైపిసి మండల టాపర్ గా వచ్చిన ఆయేషా మాట్లాడుతూ బైపీసీలో కనేకల్ మండల టాపరు గా నాకు మార్కులు వచ్చినందుకు సంతోషంగా ఉంది అలాగే మాపై ఎంతో శ్రద్ధ ఉంచి మా కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు మాపై చూపిన అభిమానం . మరియు చదువులో వారి పిల్లల లాగే మమ్మల్ని చూస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ ఫలితాలు రెండో సంవత్సరం ఇంటర్లో కూడా మరింత మెరుగ్గా చదివి మా కళాశాలకు మా తల్లిదండ్రులకు జిల్లాస్థాయిలో పేరు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు