మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు. మార్చి 06న జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీల నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖలు వారీగా మహిళా ఉద్యోగినులు, ఆయా శాఖలు సేవలు అందించే మహిళా ఉద్యోగులను తగిన రీతిలో గౌరవించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, డీఎఫ్ఓ కృష్ణ ప్రియ, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.
