బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి తెలుగు జాతి ఆత్మ గౌరవన్ని నిలపడానికి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ,అన్న తారక రామారావు స్పూర్తితో ప్రతి కార్యకర్త పని చేయాలి.
నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹చదలవాడ అరవింద బాబు.
నరసరావుపేట పట్టణంలో శనివారం నాడు ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం నాయకులు కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్తల అవార్డులు అందించారు.పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయం నందు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు తో కలిసి ఎమ్మెల్యే డా”చదలవాడ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.నరసరావుపేట పట్టణంలోని అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా”చదలవాడ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుజాతి ఔన్నత్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కొనియాడారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పునాదులు వేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం పేదలకు పక్కా గృహాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతిగా ఎన్టీఆర్ను కొనియాడారు నందమూరి తారకరామారావు స్ఫూర్తితో ప్రతి కార్యకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ మరెన్నో అభివృద్ధి కార్యక్రమలు చేస్తూ ప్రజలకు సేవలందిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…


