Janasena News Paper
పల్నాడు

అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం…

అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ  J.V. సంతోష్ .


ది.10.07.25…..తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డుకి ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులు. అభినందించిన  ఎస్పి

తెనాలి రూరల్ పీఎస్ నందు విధులు నిర్వర్తిస్తూ ది.18.02.2025 వ తేదీన HG 582 Y.శ్రీనివాస్ హార్ట్ ఎటాక్ వలన మరణించడం జరిగింది.
అందుకు గాను Y.శ్రీనివాస్ కుటుంబానికి హోం గార్డులు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును జిల్లా అదనపు ఎస్.పి  J.V.సంతోష్ గారి చేతుల మీదుగా శ్రీనివాస్  భార్య అయిన Y.కళ్యాణి కి అందచేశారు.

సాటి హోమ్ గార్డులకు సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోమ్ గార్డులను అదనపు ఎస్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ JV సంతోష్ తో పాటు హోంగార్డు ఆర్.ఐ యస్.కృష్ణ  పాల్గొన్నారు.

Related posts

Leave a Comment