నిమ్మ రైతులకు కనీస ధరలు కల్పించాలి..
కిలో నిమ్మకాయలకు రూ.10 ధర రావడంతో నష్టాల్లో నిమ్మ రైతులు..
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిమ్మ రైతులు ఆందోళన
ఏలూరు జిల్లా,ద్వారకాతిరుమల మే 26:
ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ద్వారకాతిరుమల లోని వ్యవసాయ మార్కెట్ యార్డు లోని నిమ్మ కాయల మార్కెట్ ను రైతు సంఘం నాయకులు శుక్రవారం పరిశీలించారు. నిమ్మకాయలకు వస్తున్న ధరలను రైతులను అడిగి రైతు సంఘం నాయకులు తెలుసుకున్నారు. కిలో నిమ్మకాయలకు రూ.10 లు మాత్రమే రావడంతో నష్టపోతున్నామంటూ అబ్బూరి రత్తయ్య అనే నిమ్మ రైతు రైతు సంఘం నాయకులు ముందు వాపోయారు