తృటిలో తప్పిన ప్రమాదం. డ్రైవర్ చాకచక్యం.
పల్నాడు జిల్లా:
గుంటూరు నుండి సత్తెనపల్లి వస్తున్న AP03Z 5034 నెంబర్ గల పల్లె వెలుగు బస్సు నందిగామ అడ్డ రోడ్డు వద్ద స్టీరింగ్ ఊడిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కకు నిలుపుదల చేశాడు. బస్సులో సుమారు 30మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు క్షేమంగా ఆగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాలం చెల్లిన బస్సులు రోడ్ల మీదకు తీసుకువచ్చి నడపడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అలాంటి కాలం చెల్లిన బస్సులు నడపకుండా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.