Janasena News Paper
తాజా వార్తలుపార్వతీపురం మన్యం

విశాఖ శిక్షణా కార్యక్రమంలో మన్యం జిల్లా డిఎంఓ

విశాఖ శిక్షణా కార్యక్రమంలో మన్యం జిల్లా డిఎంఓ .

జనసేన ప్రతినిధి పార్వతీపురం,ఏప్రిల్10: మలేరియా,డెంగ్యూ మొదలగు కీటక జనిత వ్యాదుల నియంత్రణపై జోన్-1 జిల్లాలకు విశాఖపట్నంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డాక్టర్ టి. జగన్ మోహనరావు తన వైద్య బృందంతో బుధవారం హాజరయ్యారు. జోనల్ మలేరియా అధికారి డాక్టర్ ఎం.శాంతిప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మలేరియా,డెంగ్యూ వ్యాదులు సంక్రమించే విధానం,వాటిని గుర్తించడం,నిర్ధారణ చేయడం,చికిత్స,దోమల వ్యాప్తిని అరికట్టే పద్ధతులు,కీటక సంహారిణి రసాయనాలు వినియోగించే సాంకేతిక పద్ధతుల పై వివరించారన్నారు.

దోమల నియత్రణను పక్కాగా చేపట్టాలంటే వాటి జీవిత చక్రం,అవి వృద్ధి చెందే విధానం ఖచ్చితంగా తెలుసుకోవాలని వాటిని వివరించారు.జ్వర కారక దోమలను గుర్తించడాన్ని అక్కడ శిక్షణలో మైక్రోస్కోప్,టెస్ట్ ట్యూబ్స్ లో చూపించారన్నారు.జ్వర లక్షణాలు ప్రతీ ఒక్కరికీ తెలియాలని,అందువల్ల మలేరియా,డెంగ్యూ త్వరగా నిర్ధారణ చేసి చికిత్స అందించడం ద్వారా జ్వర తీవ్రతను నివారించవచ్చన్నారు.దోమల వ్యాప్తి నియంత్రణకు లార్వా వృద్ధి చెంది ప్రదేశాలను గుర్తించి,తొలగించడం ముఖ్యమని,అందుకు డ్రైడే కార్యక్రమం దోహదపడుతుందని,కాబట్టి ప్రజలందరూ డ్రైడే పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.కీటక సంహారిణి రసాయనాలు,వాటిని మిక్సింగ్ కొరకు అవసరమైన పరిమాణం,కలిపే విధానం,స్ప్రేయింగ్ పంపులు రకాలు,పిచికారీ చేయి విధానం వివరించారన్నారు.

రాబోవు సీజన్లో మలేరియా,డెంగ్యూ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో వచ్చే నెల 15 నుండి మొదటి విడత స్ప్రేయింగ్ 401 గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లా నుండి ఆయనతో పాటు ఏఎంఓ సూర్యనారాయణ,విబిడి కన్సల్టెంట్ రామచంద్ర,మలేరియా సబ్ యూనిట్ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Related posts

Leave a Comment