- ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి..!
- కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి..
- జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
- స్పందన కార్యక్రమంలో వినతులు 278 జిల్లా కలెక్టర్ స్వీకరించారు
పుట్టపర్తి ఫిబ్రవరి 5, :జనసేన బ్యూరో :ప్రతి సోమవారం జరిగే జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల ద్వారా278 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, డి ఆర్ డి ఏ పి డి నరసయ్య, గ్రామ, వార్డు సచివాలయ నోడల్ అధికారి శివారెడ్డి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పందన సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా , మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలంలో వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ఈ అంశంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ రాదని వీలైనంత త్వరగా అర్జీలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే కార్యక్రమం జిల్లాలో జరిగిన నేపథ్యంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉంటుందని అన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కులగణన ప్రక్రియపై ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
ముఖ్యంగా మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో జరుగుతున్న సర్వే తో పాటు ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యసాధన పై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. వాల్ ఇంటర్ లో సెక్రటేరియట్ సిబ్బంది ఇంటింటా తిరిగి జిల్లావ్యాప్తంగా 90% కులగణన సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు గ్రామ, వార్డు పరిధిలోని సచివాలయాల్లో ఏవైనా కారణాలవల్ల మిగిలిపోయిన కుటుంబాలు సర్వే కు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన సర్వే నివేదికలను డివిజన్ స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు , మున్సిపల్ కమిషనర్లు ,ప్రత్యేక అధికారులు పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
ఈరోజు సాయత్రం లోగా 95% సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఈరోజు 17 మంది ఎంపీడీవోలు, వివిధ జిల్లాల నుంచి ఆయా మండలాల తాసిల్దారులు , ఈరోజు నుంచి విధులలో పాల్గొన్నారు, ఆఫీసర్లు, సెక్టర్ ఆఫీసర్లు, పోలింగ్ స్టేషన్లలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికలను ఈనెల తొమ్మిదో తేదీలోపు నాకు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈనెల తొమ్మిదో తేదీన ఎన్నికల సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ శిక్షణకు నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ ఎన్నికల అధికారులు, నియోజకవర్గ సహా ఎన్నికల అధికారులు హాజరుకావాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఆర్ ఓ బుక్ ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలని తెలిపారు, నామినేషన్ ప్రక్రియ గురించి జాయింట్ కలెక్టర్ శిక్షణ కార్యక్రమంలో వివరిస్తాడని పేర్కొన్నారు, మోడల్ ఆఫ్ కండక్ట్ అనే అంశంపై డిఆర్ఓ వివరిస్తాడని తెలిపారు. పెనుగొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సంబంధిత అంశాలపై సమగ్రంగా శిక్షణ కార్యక్రమాలలో వివరిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఓటర్ల తుది జాబితా తర్వాత మరికొంత అవకాశం ఇచ్చినప్పటికీ లోపాలు సరిదిద్దకపోవడం సరికాదన్నారు .
ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న 6 ,7 ,8 క్లైమ్ లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బిఎల్వోలు విఆర్వోలు ఏఈఆర్వోలు ప్రత్యేక చొరవ చూపాలని , స్పందన కార్యక్రమం నందు ఈరోజు వచ్చిన వినతలు నల్లమడ మండలం అరవాండ్లపల్లి గ్రామంలో నివసించే బొజ్జ నాయక్ అను నేను పొలం సర్వేనెంబర్ 580-A మాకు భూమి కలదు మా చిన్న తాత గారి వారసులు మొత్తం భూమిని పాస్ పుస్తకములో ఎక్కించుకున్నారు వాటిని రద్దు పరిచి వన్ బి అడంగల్ నందు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయవలసిందిగా వినతలు అందజేశారు.
పుట్టపర్తి మండలం వెంకటయ్య గారి పల్లి నివసించు గంగమ్మ సర్వే నెంబర్ 362-2 3 ఎకరాల51 సెంట్లు నా పేరు మీద కలదు.120 సెంట్లు భూమి మా పొలానికి ఆనుకొని ఉంది మేము సాగులో ఉన్నాము మాకు తెలియకుండా 1.20 సెంట్లు భూమి తిరుపాలు, గంగయ్య పేరు మీద ఇచ్చినారు వారి పేర్లు తొలగించి మా పేర్లు ఎక్కించవలసిందిగా వినతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పద్మావతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ ప్రతినిధి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్ , డిపిఓ విజయ్ కుమార్, గిరిజన సంక్షేమ అధికారి, మోహన్ రావు, వ్యవసాయ అధికారి సుబ్బారావు, బీసీ సంక్షేమ అధికారి శ్రీమతి జ్యోతి నిర్మల, సిపిఓ విజయ్ కుమార్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు