Janasena News Paper
పల్నాడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో పాల్గొన్న ఏవో బసవకుమారి,ఉషారాణి,కవిత..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో భాగంగా ఈరోజు రాజుపాలెం మండల కేంద్రం అయిన మండల ఆఫీసులో మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఆయా విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించడం జరిగింది.
సీడీపీఓ మాట్లాడుతూ…రాష్ట్ర స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్ గా  రెడ్డిగూడెం ఓసీ 02 సెంటర్ సయ్యద్ ఆన్వర్ బేగం ని సన్మానించి, పుష్ప గుచ్చం ఇచ్చి  మహిళలు సృష్టికి మూలం స్త్రీని ఒక్కప్పుడు వంటింటి కుందేలు అని, వంటింటికే పరిమితం చేసారు అని కానీ తర్వాత మారుతున్న కాలంతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందు ఉన్నారని సామానత్వం తో అన్ని విషయంలో మన హక్కులు పొందుతన్నారని ఇలాగే ముందుకు సాగాలని అంగన్వాడీ లకు కూడా మీ పరిధిలో ఉన్న ఆడ శిశువులని కూడా పోషక లోపాలు లేకుండా, ఆరోగ్యావంతమైన ఆహారపు అలవాట్లు గురుంచి తెలియ చెప్పాలి అని బాల్య వివాహల పైన కూడా అవగాహన కల్పించాలని 18సంవత్సరాలు నిండ కుండానే వివాహాలు చేసుకోకూడని బాలికలు తమ కాళ్ళ పై తాము నిలబడాలని ఒక స్థాయికి  చేరాకనే వివాహాలు చేసుకోవాలని అన్నారు…
బసవకుమారి మాట్లాడుతూ… ఆడవాళ్లు అన్ని రంగాలలో ముందు ఉండాలని మన హక్కులు మనం కాపాడుకోవాలని, అసలు స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదని, మానవ మనుగడకు స్త్రీ మూలం అని అందరూ ఆడవారు మంచి స్థాయిలో ఉండాలని ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి కార్యక్రమం లో భాగస్వామిని చేసారని అన్నారు.
ఏసీడీపీఓ మాట్లాడుతూ…జిల్లా కలెక్టర్, జిల్లా పీడీ ఆదేశాల మేరకు మహిళా దినోత్సవం జరుపుకోవడం తను కూడా చాలా సంతోషిస్తున్నాని ఈకార్యక్రమం అందరూ ఒక కుటుంబం లాగా అనిపిస్తుంది అని మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని పౌషక ఆహరం,యోగ,గర్భిణీలకు
తీసుకోవలిసిన జాగ్రత్తలు గురుంచి, హ్యాపీవుమన్, హెల్తీ వుమన్,పోషక ఆహారం మహిళలు ఎలా తీసుకోవడం గురుంచి చెప్పారు.హెల్త్ సూపెర్వైసర్ ఉషారాణి మాట్లాడుతూ…. ఆరోగ్యం పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని,తగిన శ్రద్ధ తీసుకోవాలని మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాధిని ఆరోగ్యంతో ఉంచొచ్చు అని, కుటుంబానికి మహిళలే వెన్నుముక అని, మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని, వివక్షత చాలా చూపే వారిని అలాంటి పరిణామాలు చూసి చాలా బాధ పడ్డానని, ఇప్పుడు ఉన్న కాలంలో సమానత్వం సాధించుకున్నామని అని అన్నారు…మండలం లో పని చేస్తున్న ఉత్తమ ఎఎన్ఎం,జిఎంఎస్కె, అంగన్వాడీ కార్యకర్తలకి సన్మానం చేసారు.ఎఎన్ఎం ధనలక్ష్మి,జిఎంఎస్కె మనీషా,అంగన్వాడీ వర్కర్స్ జయకుమారి, సంతోషకుమారి,సాంబ్రాజ్యం ని మండలపరిషత్ ఏవో బసవకుమారి,ఎంఆర్వో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ కవిత,హెల్త్ సూపర్వైసర్ ఉషారాణి, సీడీపీఓ శ్రీలత, ఏసీడీపీఓ సంతోషకుమారి చేతులతో సన్మానించారు. ఈకార్యక్రమంలో మండల స్థాయి అంగన్వాడీ కార్యకర్తలు,సూపర్వైసర్లు పాల్గొన్నారు..

Related posts

Leave a Comment