రాజుపాలెంరూరల్,మార్చి16,జనసేన ప్రతినిధి…..
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీ చెందిన దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గరికపాటి శంకర్ రావు కు పొన్నూరు కిరాణా అసోసియేషన్ కళ్యాణ మండపం నందు ఆదివారం మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ చైర్మన్ టి ఉమా శంకర్ రావు ప్రముఖ కవి రచయిత రంగు శెట్టి రమేష్ ఉద్యోగ రాజకీయ విశ్లేషకులు చందు సాంబశివరావు స్థానిక నాయకులు పార్వతి నాయుడుచేతుల మీదగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారాలను అందుకోవటం జరిగింది ఈ సందర్భంగా అవార్డు గ్రహీత గరికపాటి శంకర్రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారాల అవార్డు నన్ను ఎంపిక చేసిన మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ చైర్మన్ తిరుమల శెట్టి ఉమాశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం నిరంతరం తాను 20 సంవత్సరాల నుంచి ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వచ్చిందని తెలిపారు తనకు అవార్డు రావటం వలన మరింత బాధ్యతలు పెరిగిందని ఆనంద వ్యక్తం చేశారు 20 సంవత్సరాల నుండి తల్లిదండ్రులు లేని పిల్లలు వృద్దుల కోసం అనాధ ఆశ్రమ స్థాపించి వారి అలనా పాలన చూస్తూ వారికి ఆశ్రమం కల్పిస్తున్నారు పేదరికం గా ఉన్న పిల్లలకు సుందరి కాలనీలో పాఠశాల ఏర్పాటు చేసి వారికి విద్యాబోధన నేర్పిస్తున్నారు వలస వెళ్లిన తల్లిదండ్రుల పిల్లల కోసం సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు విద్యాబోధనలను చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరం బీహార్ ఒరిస్సా నుండి వలస వచ్చిన కార్మికుల పిల్లలు కోసం గుంటూరు పట్టణంలోని మిర్చి యార్డ్ ఎదురుగా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి వారికి విద్యా బోధనలు నేర్పిస్తున్నారు ఉచిత వైద్యం నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం వయోవృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడాలని వారికి ఉచిత టైలరింగ్ సెంటర్ ని మూడు నెలల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించి వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది ఆకలితో ఉన్న వృద్ధులకు వారికి మధ్యాహ్నం పూట భోజన వసతి కల్పించడం జరుగుతున్నది.ఈ అవార్డు అందుకున్న గరికిపాటి శంకరావని పలువురు అభినందించారు…..
