సత్యసాయి స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.
కొత్తచెరువు జనసేన ప్రతినిధి,డిసెంబర్ 04
కొత్తచెరువు నుండి పెనుగొండ వెళ్లే ప్రధాన రహదారిలోని శెట్టిపల్లి క్రాస్ వద్ద శ్రీ సత్య సాయి స్వాగత తోరణాన్ని పుట్టపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పెనుకొండ మండలం కొండంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు శ్రీ సత్యసాయి స్వాగత తోరణాన్ని ఢీ కొని పొలాల్లోకి దూరంగా దూసుకెళ్లింది.
బస్సు ముందు భాగం సగానికి పైగా ధ్వంసం అయింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారా లేదా ఉంటే ఎంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి అన్నది తెలియాల్సి ఉంది.