ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఆవిర్భావ దినోత్సవ సమన్వయ సమన్వయకర్త కిలారి రోశయ్య పాల్గొన్నారు.
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సందర్భంగా 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే ప్లీనరీ సమావేశానికి జన సమీకరణకు సంబంధించి సమాలోచన చేశారు.
ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయం ఇంచార్జ్ సిరిగిరి మణికంఠ, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, జనసేన పార్టీ నాయకులు పగడాల నరసింహారావు, చెవుల ఆంజనేయులు,షేక్ గౌస్, అంబటి పున్నారావు తదితరులు పాల్గొన్నారు…..
