ముఖ్య అతిథిగా పాల్గొన్న బొర్రా
బడుగుబలహీన వర్గాల పార్టీ జనసేన పార్టీ బొర్రా
సత్తెనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ 11సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకొని నేడు12 ఆవిర్భావ దినోత్సవం లోకీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఎదురుగా జనసేన జెండా ఆవిష్కరణ చేశారు.వడ్డవల్లి పోలేరమ్మ సెంటర్లో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో బొర్రా మాట్లాడుతూ…….
నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం దగ్గర చిత్రాడ గ్రామంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో దూళిపాళ్ల కేంద్రంగా పట్టణంలో పలుచోట్ల జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాల ఆవిష్కరణ జరిగింది.జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకొని12వ ఆవిర్భావ దినోత్సవ లోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొని,
పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాలు కష్టాలను ఎదుర్కొని నిలబడి పార్టీని అధికారంలోకీ తేవడం జరిగింది..కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించారు పవన్ కళ్యాణ్…అని అన్నారు.ఈరోజు పిఠాపురం దగ్గర చిత్రాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.సభకు సత్తెనపల్లి నుంచి భారీగా వాహనాలు,
అభిమానులు తరలివస్తున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో జనసేన 7 వార్డ్ కౌన్సిలర్ రంగ్ శెట్టి సుమన్ కుమార్, తాపీ మేస్త్రి యూనియన్ ప్రెసిడెంట్ బొల్లి మహేష్, బత్తు ల ఆంజనేయులు, పాపిశెట్టి వెంకటరావు, దాసరి తిరుపతిరావు,
తాపీ మేస్త్రి యూనియన్ సెక్రటరీ పాపిశెట్టి నారాయణ,ఆలపాటి రమేష్, పాపిశెట్టి రాంప్రసాద్,ఆలపాటి విజయ్ పాలెం నాగరాజు రామిశెట్టి సందీప్ , పసుపులేటి మల్లి,కోట మాణిక్యం, అనిల్,పవన్, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు……

