Janasena News Paper
పల్నాడు

గన్నమనేని సహకారంతో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ…….

సత్తెనపల్లి పట్టణంలో సుగాలి కాలనీమరియు ధూళిపాళ్ల జిల్లా పరిషత్  ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు సహకారంతో అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని కృషి చేయాలని,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పెద్దవారిని, మహిళలను, గౌరవించాలి,రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, డ్రగ్స్ నిర్మూల సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఇతరులను చైతన్య పరచడంలో ముందుండాలి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు సద్వినియోగం చేసుకోని ఉన్నతులుగా ఎదగాలి,తరగతి గదితోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని,వత్తిడి లేకుండా చదవాలి, పరీక్షలు ప్రశాంతంగా రాయాలన్నారు.భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగిన తరవాత  గురువులకు తల్లిదండ్రులకు సొంత గ్రామానికి,సమాజానికే మంచి పేరు తేవాలని కోరారు.ఉపాధ్యాయులు చెప్పే అంశాలను శ్రద్ధగా ఆసక్తితో నేర్చుకోవాలని అన్నారు.యువ ఇంజనీర్ గొల్లపల్లివీరాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా,ఇంటర్నెట్ ప్రభావం చాలా ఉన్నది విద్యార్థులు దాని ప్రభావానికి లోనవలుండా మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలి. రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూల, సైబర్ మోసాల నిర్మూల, మహిళలపై వేధింపు, బెట్టింగ్ లులాంటి సామాజిక అంశాలు అసాంఘిక చర్యలు నిర్మూలించడంలో సమాజంలో చైతన్యం కలిగించాలి అన్నారు.బాధ్యతగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వర్లు, కట్ట కృష్ణ మూర్తి,పట్రా కిషోర్,నెల్లూరి గోపి కృష్ణ, ఉపధ్యాయులు నరసింహరావు, ఝాన్సీ రాణి, గిరి,తదితరులు పాల్గొన్నారు…..

Related posts

Leave a Comment