ఈ రోజు ఉదయం 10 గంటలకు బూత్ స్థాయి అదికారుల శిక్షణ తరగతులు లయోలా కాలేజ్ (దూళ్ళిపాళ్ళ గ్రామం,సత్తెనపల్లి మం.) జరిగినది. సదరు శిక్షణా తరగతుల యందు, జి.వి .రమాణాకాంత్ రెడ్డి ఆర్డీవో & ఒటర్ల నమోదు అదికారి సత్తెనపల్లి, మాట్లాడుతూ బూతు స్థాయి అధికారులు వారి విధులు తుచ తప్పకుండా నిర్వహించాలని, ఒటర్ల జాబితా పక్కాగా తయారు చేసినట్లయితే 90% సమస్యలు రాకుండా ఉంటాయని, ఎన్నికల కమిషన్ వారి నిబంధన లకు లోబడి ప్రతి ఒక్కబూతు స్థాయి అధికారి తప్పులు లేని ఒటర్ల జాబితా తయారు చేయుటకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయవలెనని తెలియ జేసియున్నారు, సదరు శిక్షణా తరగతులకు నియోజకవర్గంలోని సహయ ఒటర్ల నమోదు అదికారులు, బూత్ స్థాయి అదికారులు, ఎన్నికల సిబ్బంది, పాల్గోనియున్నారు..

