పట్టణ సీఐ బ్రహ్మయ్య వివరణ..
సత్తెనపల్లి పట్టణానికి చెందిన రౌడీషీటర్ ఖాసిం సైద తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య తెలిపారు.
మంగళవారం సోషల్ మీడియాలో పట్టణ పోలీసుల పై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు.
తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకునేందుకు కాసిం సైదా ఈ డ్రామా ఆడినట్లు సీఐ పేర్కొన్నారు.
గతంలో జరిగిన కేసు సంభాషణను ఇప్పుడు లింకు చేస్తూ…కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెర లేపారని ఆయన స్పష్టం చేశారు.దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వారు చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని సీఐ బ్రహ్మయ్య తెలిపారు.
