సత్తెనపల్లి:
స్థానిక సత్తెనపల్లి పట్టణంలో రోటరీ క్లబ్,వాసవి మణికంఠ క్లబ్ ఆధ్వర్యంలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వారి సౌజన్యంతో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ ఆదరణ లభించిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మాతంగి సాంబశివరావు,వాసవి మణికంఠ సభ్యులు తెలిపారు.
వైద్య శిబిరంలో సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ సింగరాజు విద్యా ఆధ్వర్యంలో బీపీ షుగర్ థైరాయిడ్ జ్వరాలు నరాల సమస్యలు గుండె సంబంధిత సమస్యలు మరియు ఇతర జనరల్ వ్యాధులకు రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.
అలానే మరొక వైద్యులు డాక్టర్ సింగర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో నిమ్మ ఉబ్బసం ఆయాసం దీర్ఘకాలిక దగ్గు ఎలర్జీ తుమ్ములు ముక్కు కారుట,ఇతర శ్వాసకోశ మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో సుమారు 150మందికి ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ పి ఎఫ్ టి పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ వైద్యులు రోటరీ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి మరియు వాసవి మణికంఠ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి వారిని భవిష్యత్తులో ప్రజలకి ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారు చేసే ఈ వైద్య శిబిరానికి మా హాస్పిటల్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ యాజమాన్యం వారిని అభినందించారు అదేవిధంగా రోటరీ క్లబ్ సత్తెనపల్లి,వాసవి మణికంఠ క్లబ్ సత్తెనపల్లి ఆహ్వానం మేరకు సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు ముందుకు వచ్చి ఈ వైద్య శిబిరంలో,
పాల్గొని వారు సూచనలు సలహాలు, ఉచితంగా పరీక్షలు మందులు పంపిణీ చేసినందుకు వైద్యులను సత్కరించి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు మరింత చేరువ కావాలని ఆశించారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జోనల్ చైర్మన్ బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్, వాసవి మణికంఠ క్లబ్ జోన్ చైర్మన్ వనమా నాగేశ్వరరావు,అధ్యక్షులు కొప్పరావూరి కాశీ వెంకట సుబ్బారావు (గోపాల ట్రెండ్స్),సెక్రటరీ సూరె శ్రీనివాసరావు,ట్రెజరర్ కాశీ విశ్వేశ్వర రావు, రోటరీ క్లబ్ డైరెక్టర్ లేళ్ళ అయోధ్య కృష్ణ,సుభాని మాస్టర్,మాతంగి రాహుల్ గౌతమ్,వాసవి మణికంఠ క్లబ్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు….


