డాక్టర్ జీవ జ్యోతి,,పిజియో థెరపీ, సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల…..


సత్తెనపల్లి,ఏప్రిల్24,జనసేన ప్రతినిధి…
ఇద్దరు దాతల సహకారంతో 240మందికి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ
పథకంలో 39 వ సారి నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందించటం అభినందనీయం…. డాక్టర్ జీవ జ్యోతి,,పిజియో థెరపీ, సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల….గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 39 వ సారి ఇద్దరు దాతల సహకారంతో 240 మందికి ఉచితంగా భోజనం అందించటం జరిగింది.మొదటి దాత 3,300 రూపాయలు అందించారు, రాజ్ కిరణ్ భాస్కర్ భార్య క్రిష్ణవేణి 25 వ వివాహ వార్షికోత్సవ సందర్బంగా (సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ) 120 మందికి ఉచితంగా భోజనం అందించటం జరిగింది.మరో దాత 3,600 రూ ఆర్ధిక సహాయంతో నిరుపేద రోగులకు,వారి సహాయకులకు 120 మందికి, సత్తెనపల్లి పట్టణానికి చెందిన కీ.శే కొప్పురావూరి అప్పారావు జ్ఞాపకార్దం భార్య వెంకటలక్ష్మీ కుసుమకుమారి వీరి పెద్ద కుమార్డు కిషోర్ బాబు ధర్మపత్ని ఉమా రాజ్యలక్ష్మీ చిన్న కుమారుడు జర్నలిస్టు ప్రసాద్ ఆదిత్య భార్య భువన సత్య ఏకాంబరీశ్వరీ ఆర్ధిక సహాయంతో జరిగింది. మొత్తం 240 మందికి ఉచితంగా భోజనం అందించటం జరిగింది.ఈనాటి కార్యక్రమంలో జవ్వాజి రామమోహనరావు, పోతుగంటి నరసింహారావు, కట్టమూరి అప్పారావు, గుజ్జర్లపూడి సురేష్,దివ్వెల శ్రీనివాసరావు,ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.