Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం…

అభినందనీయం…కాపుగంటి రత్తయ్య,,సత్తెనపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు..

డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం పేరుతో ,దాతల సహకారంతో నిరుపేద రోగులకు వారి సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం అభినందనీయం…కాపుగంటి రత్తయ్య,,సత్తెనపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు….శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో, జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 40 వ సారి సత్తెనపల్లి మండలంలోనీ అబ్బూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు గారి పుణ్య తిథి సందర్భంగా, వీరి కుమారుడు సత్తెనపల్లి పట్టణంలోని నివాసం ఉండే ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘము మాజీ అధ్యక్షులు పెరుమాళ్ళ లక్ష్మీ శివన్నారాయణ  రూ. 3,300 రూపాయలు ఆర్ధిక సహాయంతో 120 రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజనం స్వయంగా వీరు వీరి మిత్ర బృందం చేతులమీదుగా పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్బంగా అప్పాపురపు నరేంద్ర ఈనాటి దాత అయిన పెరుమాళ్ళ లక్ష్మీ శివన్నారాయణ కు చిరు సత్కారం గావించారు.అనంతరం చిన్న వయస్సు లో మంచి కార్యక్రమం ఎంచుకొన్న అప్పాపురపు నరేంద్ర ను పెరుమాళ్ళ చిరు సత్కారం గావించారు.వక్తలు మాట్లాడుతూ పెరుమాళ్ళ  తండ్రి గారి ఆత్మకు సద్గతులు కలగాలి అని మంచి సేవా కార్యక్రమం ఎంచుకొన్నారు అని అన్నారు.ఈనాటి కార్యక్రమంలో పెరుమాళ్ళ లక్ష్మీ శివన్నారాయణ,కాపుగంటి రత్తయ్య, పోస్టల్ ప్రసాద్,సతీష్,రాజు,లింగిశెట్టి సుబ్బారావు,దివ్వెల శ్రీనివాసరావు,పోతుగంటి నరసింహారావు, సూరే రామకోటేశ్వరరావు,చిలకల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంత కార్యక్రమము విజయవంతానికి మంచి రుచి ,శుచి రకమైన బోజనము సరసమైన ధర కు అందిస్తున్న ఓగిబోయిన కొండలు ను అందరు అభినందించారు.

Related posts

Leave a Comment