సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 01,జనసేన ప్రతినిధి….

రెంటపాళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో స్వస్త్ నారి శసక్తి పరివార్ అభియాన్ క్యాంపు జరిగినది.ఈ క్యాంపుకు ముఖ్య అతిథులుగా మాజీ సత్తనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ మొక్కపాటి రామచంద్ర రావు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పవిత్ర,సిహెచ్ఓ మీనాక్షి, పంచాయతీ కార్యదర్శి దాచేపల్లి వీరాంజనేయులు, శ్రీనివాసరావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ మోహన్ బాబు, నీటి సంఘ అధ్యక్షులు శివరావు, ఏంఎల్హెచ్పి సారీక, కోటేశ్వరమ్మ, ఆషా,వైద్య సిబ్బంది,గ్రామ ప్రజలకు మెడికల్ క్యాంపు గురించి అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పి అవగాహన కలిగించారు. పోషణ గురించి అంగన్వాడి టీచర్స్ వాళ్ళ స్టాల్ కూడా కండక్ట్ చేశారు. పోషకాహారం గురించి అంగన్వాడి టీచర్స్ వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, ప్రజలు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

