సర్పంచ్ రమాదేవి, ఆళ్ళ అమరేశ్వరరావు…..




సత్తెనపల్లి రూరల్, అక్టోబర్ 02,జనసేన ప్రతినిధి…
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నందిగామ సుప్రీమ్ లోకల్ ట్రైనింగ్ సెంటర్ ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రం) వద్ద ఆయన విగ్రహాన్ని సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి విజయకుమార్ ఆవిష్కరించారు.
పారిశుధ్యం మరియు స్వచ్ఛత కార్యకలాపాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆయన జయంతి,విజయ దశమి రోజున నందిగామ లో ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లో నందిగామ ను అగ్రగామి గా ఉంచిన హరిత రాయబారులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమం లో నర్సరావుపేట పార్లమెంట్ నియోజక వర్గ టీడీపీ అధికార ప్రతినిధి ఆళ్ల సాంబయ్య, సత్తెనపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు ఆళ్ల అమరేశ్వర రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాతినేని సాంబశివ రావు, అసిస్ట్ ట్రైనర్ సి హెచ్ బొల్లయ్య, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు కుంభా వెంకటేశ్వర్లు, చిలువూరి కృష్ణ ప్రసాద్,
హరిత రాయబారులు పాల్గొన్నారు.
ఈ విగ్రహాన్ని సత్తెనపల్లి కి చెందిన పోతుగంటి నరసింహా రావు డొనేట్ చేశారు.

