Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

గ్రామ వార్డు సచివాలయా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాలని మాజీ మంత్రి, ప్రస్తుత సత్తెనపల్లి శాసనసభ్యుల వారికి వినతి పత్రం అందజేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు…..

సత్తెనపల్లి, అక్టోబర్ 10,జనసేన ప్రతినిధి…..

సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ నందు గల టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించాలని వినతిపత్రం అందించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. పరిష్కారం చూపిస్తామన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ.

శాసనసభ్యులకు వినతి పత్రం అందచేస్తున్న సచివాలయ సిబ్బంది….

గ్రామవార్డు నచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలమునకు సంబంధించిన 2 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని మనవి.

మరియు ప్రొబేషన్ ఆలన్యం అవ్వడం చేత గ్రామవార్డు సచివాలయఉద్యోగులుకోల్పోయిన 9 నెలలకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి.

ప్రమోషన్ లేకుండా ఒకే క్యాడర్లో 6 సం॥ లకు నర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ (AAS) క్రింద ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ను మంజూరు చేయాలి.

గ్రామ మరియు వార్డు నచివాలయాలలో గల 21 డిపార్ట్మెంట్ల వారందరికి, ప్రమోషన్స్ ఇవ్వని డిపార్ట్మెంట్ వారికి 40% తగ్గకుండా వదోన్నతులు కల్పించాలి.

ఇంటింటికి తిరిగి చేసే సేవలు మరియు సర్వేల నుండి పూర్తిగా విముక్తి కల్పించాలి.

ప్రతిశాఖకు సంబంధించిన సీనియారిటి జాబితా విడుదల చేయుటయు మరియు నిర్దిష్టమైన నర్వీను రూల్స్ కల్పించాలని మనవి.

ప్రభుత్వం వారు నిర్వహించే ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలకు ప్రత్యేక అతిధుల జాబితాలో (AP GWSC JAC) ప్రాతినిధ్యం కల్పించి 1.27 లక్షల మంది ఉన్నఅతిపెద్ద వ్యవస్థకి అవకాశం కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు

ఈ కార్యక్రమములో సత్తెనపల్లి పట్టణానికి చెందిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు చిలుక ప్రదీప్, ప్రధాన కార్యదర్శి మువ్వల గౌతమి, పల్నాడు జిల్లా మహిళా పోలీసు అధ్యక్షులు దామరల నళిని , వీఆర్ ఓ అరుణ , రవి, రాజు,రెబరపు సురేష్ , నాగలక్ష్మి , నరసింహా, అనంత్ ,వెంకటేష్ ,నందిని ,సాంబశివరావు,వెంకట్ నారాయణ,వినోధ్, సచివాలయంకార్యదర్శులు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు

Related posts

Leave a Comment