Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దర్జాగా బ్రతకలేని దర్జిల జీవితాలు,ఈ రోజు అంతర్జాతీయ దర్జిల దినోత్సవం సందర్భంగాబగ్గి నరసింహరావు  కార్యాలయంలో చిరు సత్కారం…

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని సబ్ కోర్టు పి.పి బగ్గి నరసింహరావు  కార్యాలయంలో ఇద్దరు దర్జిలకు చిరు సత్కారం జరిగింది. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఒకొప్పుడు సమాజంలో దర్జిలకు చాలా డిమాండు ఉండి ,వారు ఉన్నతంగా బ్రతకటమే కాక 10 మందికి ఉపాధి అవకాశాలను కల్పించి వారికి కూడా చక్కగా జీవనోపాధి  కల్పించే వారు,నేడు సమాజంలో వచ్చిన మార్పులు మరియు ఆధునీకరణ వలన ,వస్త్ర ప్రపంచంలో రెడీ మేడ్ దుస్తులు రావటం వలన స్థానికంగా బ్రతికే దర్జిల జీవితంలో దర్జా జీవనం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా దర్జిల కొరకు ప్రత్యేక పథకాలు తేవాలి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దర్జిలు ముసిని బాబు,షేక్ బాబు (చూమ్ మంత్రం బాబు)లకు చిరు సత్కారం జరిగింది.ఈనాటి కార్యక్రమంలో బగ్గి నరసింహరావు,దివ్వెల శ్రీనివాసరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, చిన్నం మణి బాబు,దాసరి తిరుపతిరావు,ఆకుల హనుమంతరావు,గంజి వీరాస్వామి,గాథం శ్రీనివాసరావు,మద్దిగుంట జగదీష్ తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment