- ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,!
- సర్పంచ్ ఆదినారాయణ
అమడగూరు, ఫిబ్రవరి 5 ,జనసేన,ప్రతినిధి
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి లక్ష్యమని కొట్టు వారి పల్లి సర్పంచ్ ఆదినారాయణ పేర్కొన్నారు. మండలంలోని కొట్టు వారి పల్లి పంచాయతీ పరిధిలోని బాలప్ప గారి పల్లి గ్రామంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో త్రాగునీటి సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడే వారిని వారి సమస్యలను గుర్తించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించడమే కాకుండా ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేయడంపై పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు