Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందనకు 58 ఫిర్యాదులు

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 05:

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్.పి.ఎస్ సతీష్ కుమార్ ఈరోజు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం నందు “స్పందన” కార్యక్రమం నిర్వహించారు.

స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. ప్రత్యక్షంగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను విని, సమస్యలను సత్వరం పరిష్కరించవలసినదిగా సంబంధిత పోలీస్ అధికారులకు తగు ఆదేశాలను జారీ చేసారు.

స్పందన” కార్యక్రమమునకు వచ్చిన ఫిర్యాదుదారులకు ఉచిత భోజన సదుపాయంను కాకినాడ రామారావుపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ డి. పి ఆర్ స్వామి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా కల్పించినారు.

ఈ “స్పందన” కార్యక్రమానికి మొత్తం 58 ఫిర్యాదులు రాగా (మహిళలు-34 & పురుషులు-24 ), వాటిలో సివిల్ వివాదాలకు సంబంధించి-20, కుటుంబ తగాదాలు-15 మరియు ఇతర సమస్యలకు సంబంధించిన 23 ఫిర్యాదులు అందినవి సదరు ఫిర్యాదులపై సమగ్ర విశ్లేషణ చేసి, సంబంధిత సర్కిల్ మరియు స్టేషన్ అధికారులు సత్వరం విచారణ పూర్తి చేసి, పరిష్కారం చేయాలని, తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేసినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి.తో పాటు అడిషనల్ ఎస్.పి. (ఎ.ఆర్) బి.సత్యనారాయణ, మరియు డి.టి.ఆర్.బి ఇన్స్పెక్టర్, ఎస్.ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Related posts

Leave a Comment