Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణనేరాలుయాదాద్రి భువనగిరి

ఇద్దరు విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి-కొడారి వెంకటేష్.

  • ఇద్దరు విద్యార్థుల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి-కొడారి వెంకటేష్.(ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు)

యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 4 : 

శనివారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో భువనగిరి బాలికల గురుకుల పాఠశాలలో చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మరణాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు ధైర్యవంతులని, ఆత్మహత్య చేసుకునే పిరికివారు కాదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారని ఆయన అన్నారు. విద్యార్థులపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని, ఆ తర్వాత హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సూసైడ్ నోట్ కూడా ఫేక్ నోట్ అని, చాలా కాలంగా రాత్రి వేళల్లో వసతిగృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు.

వెంటనే పోలీసులు వసతి గృహం వార్డెన్ ను, వంట మనుషులను , నైట్ వాచ్ ఉమెన్ ను మరియు ఆటోడ్రైవర్ చింతల ఆంజనేయులను అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతిగృహాల విద్యార్థులకు రక్షణతో పాటు మనోధైర్యం కల్పించాలని ఆయన కోరారు. ఇద్దరు విద్యార్థుల మృతి విషయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆయన అన్నారు.

Related posts

Leave a Comment