Janasena News Paper
అంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుబిజినెస్రాజకీయంవిశాఖపట్నం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముంబై ఫైల్ ఫోటో

ఆంధ్రప్రదేశ్: భారతదేశ ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది . దీనికి మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది . ఈ 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసల లాంచనప్రాయ ధరకు కేటాయించారు .

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్ (Tata Motors ) కు 99 పైసలకే భూమిని కేటాయించి అప్పట్లో వార్తల్లో నిలిచారు . ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 99 పైసలకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు 21.16 ఎకరాల భూమిని కేటాయించింది .

2024 అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ముంబైలోని టాటా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఆహ్వానించారు. దాని తర్వాత రాష్ట్ర అధికారులు మరియు టాటా కంపెనీ మధ్య నిరంతర చర్చిల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనీ కంట్రోల్ నివేదించింది .

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖపట్నం (Vishakapatnam ) లో పూర్తి కావడానికి రెండు నుండి మూడు సంవత్సరాల కాలం పట్టవచ్చు , మరియు సుమారు పదివేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.

టిసిఎస్ విశాఖపట్నంలో ప్రధమంగా అద్దె భవనం నుండి కార్యకలాపాలు సాగించి పూర్తి నిర్మాణం జరిగిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన స్థలం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తారు. అయితే అద్దె భవనం నుండి మరో 90 రోజుల్లో టిసిఎస్ విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగిస్తుందని ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది.

గతంలో ఐటీ మంత్రి లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ విశాఖపట్నం ను ఐటీ మరియు టెక్నాలజీ హబ్ (Technology Hub ) గా మార్చడం లో భాగంగా టిసిఎస్ విశాఖపట్నంలో తన ఉనికిని స్థాపిస్తుందని పేర్కొన్నారు.  రాబోయే ఐదు సంవత్సరంలో ఐటీ రంగంలో కనీసం ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

 

 

Related posts

Leave a Comment