రైతులకు మద్దతుగా దీక్ష చేసిన నల్లగొండ బిఆర్ఎస్ నాయకులు

జనసేన వార్త 6 ఏప్రిల్ 24:
ఈరోజు నల్లగొండ గడియారం సెంటర్ లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది ఈ దీక్షలో నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు… ఈసందర్బంగా.. కంచర్ల కామెంట్స్…
మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం.
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదు.
ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదు.
కరెంటు లేదు, నీళ్లు లేవు. కన్నీళ్లే మిగిలాయి.
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలి.
చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలి.
కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలి. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి.
రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి.
2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్లకు మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు.
మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా?
కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయి. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నడు కోమటిరెడ్డి.
మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది?
కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదు.
కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చింది.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు.
మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదు.
రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది.
రైతులు ధైర్యంగా ఉండాలి. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అండగా మేముంటాం.
ఈ రైతు దీక్ష కార్యక్రమం లో..
కనగల్ ఎంపీపీ కరీమ్ పాషా,నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, కొండూరి సత్యనారాయణ,బకరం వెంకన్న,కాంచనపల్లి రవీందర్రావు,ప్రముఖ కవి గాయకుడు చింతల యాదగిరి,కౌన్సిలర్ లు, యామా కవితా దయాకర్ మారగోని గణేష్,నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కనగల్ నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు.. అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి పల్ రెడ్డి రవీందర్ రెడ్డి
సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు..పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు..
తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి,సింగిల్ విండో వైస్ చైర్మన్లు,తవిటి కృష్ణ,కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి..పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, దొంతం ఇంద్ర సేనారెడ్డి,రైతుబంధు జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపర్తి జ్యోతి.. నల్గొండ కనగల్ మహిళా అధ్యక్షురాలు.. కొప్పు విమలమ్మ మర్రి రేణుక..కంచర్ల విజయ రెడ్డి పలువురు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరయ్యారు.