
చౌటుప్పల్, జనసేన, ఫిబ్రవరి 09: దేవలమ్మ నాగారం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా ఎండీ బాబా షరీఫ్, కానుగు శేఖర్, ఏజాస్, ఉడుగు వెంకటేశ్ హాజరయ్యారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని బాబా షరీఫ్ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు.

