Janasena News Paper
జాతీయం

ఇకపై రైల్వే భోగిలలో ఏటీఎం సర్వీసులు – సెంట్రల్ రైల్వే

పంచవటి ఎక్స్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన ఏటీఎం – ట్రైన్ లో మొదటి సారి ప్రారంభమైన సౌకర్యం

రైల్వే బోగీలో ఏటీఎంలు ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ రైల్వే యోచిస్తుంది.  ఇందుకోసం ముందుగా పంచవటి ఎక్స్ ప్రెస్ రైలులో ట్రయల్స్ కూడా ప్రారంభించారు . ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందించే దిశగా ఏటీఎం సర్వీసులు ప్రారంభిస్తున్నామని సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు .

భూసావల్ డివిజన్లో నాన్ ఫెయిర్ రెవెన్యూ కస్టమర్ ఇంట్రాక్షన్ మీట్ నిర్వహించిన సమయంలో రైల్వేలో ఏటీఎం ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. ఈ ప్రతిపాదన ఖరారు అయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక వినూత్నమైన నాన్ ఫెయిర్ రెవిన్యూ ఐడియా స్కీమ్ (NINFRIS) కింద ఒక అధికారిక ప్రణాళికను రూపొందించింది.  మొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తో కలిసి నాన్ ఫేర్ రెవిన్యూ (NFR) జనరేషన్ లక్ష్యంగా పంచవటి ఎక్స్ ప్రెస్ రైలులో ఏటీఎం ప్రారంభించినట్లు తెలిపారు .

 

ఈ పంచవటి ఎక్స్ ప్రెస్ మన్మాడ్ — ముంబై సర్వీస్  అందిస్తుంది. పంచవటి ఎక్స్ ప్రెస్ లో సాధ్యాసాధ్యలు మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని వేయడానికి మొదటి ట్రయల్ నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం ఒక కోచ్ లోని నిరుపయోగంగా ఉన్న స్థలంలో ఏటీఎం కియోస్క్ ను ఏర్పాటు చేశారు .  ఈ పంచవటి ఎక్స్ ప్రెస్ 22 కోచ్ లతో 2016 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది. ప్రయాణికులు వీలైనంతవరకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

భారత రైల్వేలో పనిచేసేటువంటి ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ విభాగాలు అలాగే ప్రయాణం చేసేటువంటి సీనియర్ సిటిజనులు, మహిళలు ఇంకా అనుకోని అవసరాలు ఎదుర్కొంటున్న వారికి ఏటీఎం సేవలు అందించడం లక్ష్యంగా రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్ జరిగేలా ఇంటర్నెట్ సేవలను పొందుపరిచారు .

Related posts

Leave a Comment