పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ ను బ్లాస్టింగ్ చేసి ఆ కొండ రాయిని ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా అధిక స్పీడ్ గా వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి అందులో ఉన్న నలుగురు కూలిల్లో సంఘటన స్థలంలోనే బుద్ధారామ్ (35), డేగో (24) ఇద్దరు మృతి చెందగా,స్వామి, మంగులూ అనే మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు,బాధితులు ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారుగా సమాచారం