- సామాన్యుడు శక్తివంతంగా మారవచ్చు.
- విద్యతోనే సమాజంలో గౌరవం, ముందడుగు సాధ్యం….
యాదాద్రి భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 4 :
శాస్త్రీయ ప్రణాళిక పునశ్చరణతో పరీక్షల్లో విజయం -సైకాలజిస్ట్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ 10వ తరగతి విద్యార్థులకై రాష్ట్రవ్యాప్త , మూడు నెలల ప్రేరణ కార్యక్రమం .
ఒక మనిషి శక్తివంతమైన ఆలోచనలు, నమ్మకాలు, అలవాట్లు ప్రవర్తనలతో ఉన్న సామాన్యుడు కూడా శక్తివంతంగా మారవచ్చునని, విద్యతోనే సమాజంలో గౌరవం-ముందడుగు సాధ్యమని, శాస్త్రీయ ప్రణాళిక -పునస్చరణతో పరీక్షల్లో విజయం సాధించవచ్చునని,విద్యార్థులు చదువుకునే వయసులోనే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు అనే నిచ్చెనతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చునని, విద్యార్థులు ఇటువంటి ప్రేరణ కార్యక్రమాలను సద్వినియోగపరు చుకోవాలని డాక్టర్ అశోక్ పరికిపండ్ల అన్నారు.
ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భస్వాపూర్ కస్తూర్బా విద్యాలయం లో స్పెషల్ ఆఫీసర్ వహీదా సుల్తానా అధ్యక్షతన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం,IAS ఆదేశాల మేరకు ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు మూడు నెలల పాటు నిర్వహించే రాష్ట్రవ్యాప్త ప్రేరణ కార్యక్రమంలో మాట్లాడారు.
ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రేరణ సదస్సులు నిర్వహించడం అభినంద నియమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలను పెంపొందించుట కొరకు పరీక్షల్లో విజయం సాధించాలంటే అనే అంశంపై ఉచితంగా ప్రేరణ సదస్సులు సైకాలజిస్ట్ల సంఘం సహకారంతో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సద్వినియోగపరచుకోవాలని, వివరాలకు ఫోన్ నెంబర్ 9989310141 లలో సంప్రదించాలనితెలిపారు. విద్యార్థులు లక్ష్యాలు ఏర్పాటు,చదువుకునే పద్ధతులు, జ్ఞాపకశక్తి మెలకువలు, టెన్షన్ అధిగమించే మార్గాలను సోదాహరణంగా విద్యార్థులకు వివరించారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘం యూనియన్ నాయకులు కట్టా శేఖర్, ఉపాధ్యాయ బృందం సువర్ణ ,రజిత లతోపాటు విద్యార్తి నులు పాల్గొన్నారు.