Janasena News Paper
తెలంగాణయాదాద్రి భువనగిరి

ఆరోగ్యాన్ని కాపాడుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి

ఆరోగ్యాన్ని కాపాడుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి – ఏ . ప్రదీప్ (ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి)

యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10 :
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకొని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రామన్నపేట మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి ఏ. ప్రదీప్ అన్నారు. బుధవారం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి లో మండల  న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి వచ్చాక చికిత్స చేయించుకోవడం కంటే వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్తలే ముఖ్యమని ఆయన అన్నారు. కుటుంబ యజమాని అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోతుందని, తద్వారా దేశ పురోభివృద్ధి కూడా జరగదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ దురలవాట్లను విడనాడి కుటుంబ అభివృద్ధికి, దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో రామన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న,  రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం డి మజీద్, సీనియర్ న్యాయవాదులు నరేందర్ రావు, జినుకుల ప్రభాకర్,  ప్యానల్ అడ్వకేట్లు మామిడి వెంకట్ రెడ్డి, డేవిడ్, స్వామి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జగతయ్య, మొగిలయ్య, వైద్యులు డాక్టర్ శ్వేత ప్రియాంక, డాక్టర్ మాదవా చారి , డాక్టర్ అంఖిత, డాక్టర్ లింగా యాదవ్, డాక్టర్ ముఖిత్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది సాయిదీప్ , వైద్య సేవలకు వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment