
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమీక్ష సమావేశంలో పాల్గొన్న
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య .
యాదాద్రి భువనగిరి జిల్లా జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10 :;
జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.భవనగిరి లోక్ సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించేందుకు సమీక్ష సమావేశంలో సీఎం తో పాటు *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శాలువా కప్పి సన్మానించారు.
