Janasena News Paper
అంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలు

ఆరోగ్యకరమైన సమాజం కోసం యువత క్రీడల్లో పాల్గొనాలి

*ఆరోగ్యకరమైన సమాజం కోసం యువత క్రీడల్లో పాల్గొనాలి*
*ఆంధ్రప్రదేశ్ ఖో ఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.యస్.ఆర్.కె ప్రసాద్*

 

గన్నవరం, జనసేన ప్రతినిధి, మార్చి 22.
యువత క్రీడల్లో పాల్గొనాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ ఖో ఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.యస్.ఆర్.కె ప్రసాద్ అన్నారు. శోభకృత్ నామా ఉగాది పురస్కరించుకొని గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో సీనియర్ వాలీబాల్ పోటీలు బుధవారంనాడు జరిగాయి.ఈ పోటీలను టి.యస్.ఆర్.కె ప్రసాద్,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, విజయవాడ ఎ.సి.బి సి.ఐ వెంకట రమణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా టి.యస్.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూ గన్నవరం జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు క్రీడలలో రాణించి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగారని అయన అన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ పోటీలు హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ స్పాన్సర్ గా ఉన్నారు.ఈ పోటీలలో విజయం సాధించిన జట్లు. ప్రథమ స్థానంలో గన్నవరం స్దానిక పోలీస్ జట్టు ,ద్వితీయ స్దానం లో గన్నవరం ఎయిర్పోర్ట్ పోలిస్ జట్టు, తృతీయ స్దానం లో హెచ్.సి.ఎల్ ఇండస్ట్రియల్ ఉద్యోగులు జట్టు విజయం సాధించాయి. ఈ పోటీలకు దావాజిగూడెం స్పందన మానసిక వికాస కేంద్రం హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ వారు బహుమతులు అందించారు. ఈ బహుమతులు ప్రదానోత్సవం కార్యక్రమం లో అతిధులుగా గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, కె.వి.ఆర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ కిషోర్, హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్, గన్నవరం రోటరీ క్లబ్ సెక్రటరీ గొట్టం రవి, ఐకాన్ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ వీరబత్తిన అమల్ దాస్,చెన్నారావు, పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment