Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణమేడ్చల్-మల్కాజ్గిరి

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసిన కేటుగాడు

ఏటీఎం కార్డు మార్చి 1లక్ష 73వేలు కాజేసాడు

బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు


మేడ్చల్,(జనసేన ప్రతినిధి):
ఏటీఎం నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయామని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి రూ.1లక్ష 73వేలు కాజేశాడో కేటుగాడు.ఈ ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది.మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటీ పుణ్యవతి జనవరి 27వ తేదిన మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వెళ్ళి అక్కడే ఉన్న ఓ యువకుడిని తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇయ్యమని కోరగా అతడు రూ.4వేలు డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బిఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం  ఇచ్చాడు.దీంతో తస్కరించిన ఏటీఎంతో కార్డుతో విడుదలవారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న రూ.1 లక్షా73వేల రూపాయలను కాజేశాడు.కాగా గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా కోసం ప్రయత్నించగా ఖాతాలో  డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వారి కుమారుడు వర్గంటీ కిషోర్ తో కలసి వెళ్లి ఫిర్యాదు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు.

Related posts

Leave a Comment