June 13, 2026
Janasena News Paper
Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం అధ్యక్షుడు బచ్చు కొండలు

గత ఏడు సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న కొత్త రామకృష్ణ మరియు దేవరపల్లి కాశీ విశ్వనాథం.
సత్తెనపల్లి, ఏప్రిల్13, జనసేన ప్రతినిధి….

సత్తెనపల్లి
గాంధీ బొమ్మ సెంటర్లో ఎండాకాలం నిమిత్తం బాటసారిలకు దప్పిక తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తథనంతరం మినరల్ వాటర్ ని అందిస్తున్నారని కార్యక్రమం ముఖ్య అతిథి కొండలు నిర్వహకులు నీ అభినందించారు.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అన్నం బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా భావంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అందులోనూ గత ఏడు సంవత్సరాలుగా ఎండాకాలం మొత్తం మజ్జిగ అందించడం అభినందించ తగ్గ విషయం అని కొనియాడారు.కొత్త రామకృష్ణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కాంప్లెక్స్ మిత్రుల సహకారంతో దాతల ప్రోత్సాహంతో ఈ సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ ప్రారంభించామని ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన సతీష్ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవరపల్లి కాశీ విశ్వనాథం, చెక్క రవికుమార్, బావిరి శెట్టి హరికృష్ణ, శ్రీను, రవి మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment