అంబాజీపేట లో ఘనంగా అచ్చెన్న నాయుడు పుట్టినరోజువేడుకలు
అమలాపురం,జనసేన ప్రతినిధి,మార్చి,26
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
అచ్చె న్నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట మండల అధ్యక్ష కార్యదర్శులు దంతులూరి శ్రీను రాజు,గూడాలఫణి అంబాజీపేట సెంటర్లో ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య సమకూర్చిన దుప్పట్లను పేదలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి దాసరి వీర వెంకట సత్యనారాయణ, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, బొంతు పెదబాబు, మాజీ ఏఎంసి చైర్మన్ అరిగెల బలరామమూర్తి, మాజీ సొసైటీ అధ్యక్షులు గణపతి వీర రాఘవులు, జిల్లా సాంస్కృతిక విభాగం అధికార ప్రతినిధి రవణం రాము, పుల్లేటికురు ఎంపీటీసీ పబ్బినీడి రాంబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగబత్తుల సుబ్బారావు నియోజకవర్గ గుమ్మడి వెంకటేశ్వరరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ యడ్లపల్లి తుక్కయ్య, మండల తెలుగు యువత అధ్యక్ష కార్యదర్శులు తు పళ్ళ శ్రీను,గుబ్బల నాగ వెంకటరమణ, మండల ఐ టిడిపి అధ్యక్షులు,మట్టా నాగేంద్ర, మాచవరం గ్రామ శాఖ అధ్యక్షులు దొమ్మేటిశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.