పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నకిలీ లేబర్ ఆఫీసర్ హల్ చల్ చేశారు….
లేబర్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ వ్యాపారస్తుల దగ్గర నుండి డబ్బులు వసూళ్లు చేశారు.
సత్తెనపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న షాపుల వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి సదరు వ్యక్తిని వ్యాపారస్తులు శుక్రవారం పోలీసులకు అప్పగించారు.
లేబర్ ఆఫీసర్ ఫిర్యాదుతో నకిలీ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.సదరు వ్యక్తి ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కందుల వెంకయ్యగా గుర్తించారు.
గత మూడు రోజుల నుండి వ్యాపారస్తుల దగ్గర నుండి వెంకయ్య డబ్బులు వసూలు చేస్తున్నాడు.
