పట్టణ ప్రజలకు వేసవి కాలం నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని…..ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేసుకోవాలి.
చిలకలూరిపేట : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం నాడు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పార్టీ నాయకులతో కలిసి రెండు మంచినీటి చెరువులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారణకు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో సాగర్ నుండి విడుదలైన జలాలను, రెండు చెరువులకు నీరు నింపటం జరిగిందని అన్నారు, అయితే వేసవి కాలం అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు భూమిలో డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి, కావున పెరిగిన నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని
వీలైనంత ఎక్కువగా మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని పట్టణ ప్రజలను కోరారు, అదే విధంగా గృహ అవసరాలకు మంచినీటి సరఫరా లో ఎటువంటి మార్పులు లేకుండా పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు నీటిని కుళాయి ల ద్వారా పంపిణీ చేయాలని శాసన సభ్యులు వారు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులను కోరారు,అదే విధంగా వ్యాపార వర్గాల వారు కూడా వేసవి కాలంలో తాగునీటిని
తాగు నీటి అవసరాల కోసం వాడుకోవాలని మరే ఇతరత్రా కార్యక్రమాలకు వాడుకోకుండ సహకరించాలని కోరారు,
ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు మంచినీటి సరఫరా లో అంతరాయం కలగకుండా ఏమైనా లీకులు ఏర్పడిన మరమ్మతులు చేయవలసి ఉన్న ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా శివారు ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు , ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి టీ.డి.పి. కరిముల్లా. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, తదితరులు ఉన్నారు….
Related posts
- Comments
- Facebook comments