Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

గజ్జల నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో….

ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామంలో

ఉచిత మెడికల్ క్యాంప్…

ముప్పాళ్ళరూరల్,ఏప్రిల్24,జనసేన ప్రతినిధి…

జిబిఆర్ హాస్పిటల్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారి వైద్య బృందం పాల్గొని ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించారు.రుద్రవరం గ్రామానికి చెందిన 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితం మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందించినందుకు గ్రామస్తులు జిబిఆర్ హాస్పిటల్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, ఎంపీపీ పద్మావతి రామలింగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఇందూరి నర్సింహారెడ్డి, సర్పచ్ రాప్తోడ్ వెంకటకృష్ణ రెడ్డి, మండల యువజన విభాగం మాజీ అధ్యక్షులు సుభాని, ఈసిరెడ్డి శివకోటి రెడ్డి,అగస్టిన్ బాబు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment