Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు

ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మందికి రూ.ఐదు వేలు చొప్పున లక్ష ఆర్థిక సహాయం .

  • విద్యార్థులు వత్తిడి లేకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చిట్టా ఈశ్వర సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చిట్టా సాయి బ్రాహ్మణి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చిట్టా ఈశ్వర సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్తనపల్లి పట్టణంలోని శభరిగిరి అపార్ట్మెంట్లో లో 24 వార్డ్ కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నా సోదరి చిట్టా ఈస్వార సాయి. 10వ తరగతి , ఇంటర్, వైద్య విద్య లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచారు.. మీరంతా కూడా అదేవిధంగా చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. 2013 నుంచి నా తండ్రి విజయ భాస్కర్ రెడ్డి, పెదనాన్న కృష్ణ జ్వాలా రెడ్డి, బాబాయ్ బాపూజీ రెడ్డి. భరద్వాజ రెడ్డి ఉమ్మడి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు, పేద పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటుగా పుస్తకాలు పంపిణీ, రక్త దానం, తుఫాన్ సమయంలో బాధితులకు అండగా అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. విద్యార్థులను ఉద్దేశించి సీనియర్ న్యాయవాదులు దాసరి జ్ఞానరాజ్ పాల్ మర్రి సుబ్బారెడ్డి, రాజవరపు శివనాగేశ్వరరావు, చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, జొన్నలగడ్డ విజయ్ కుమార్ లు ప్రసంగించారు ప్రతిభగల 20 మంది నిరుపేద పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని నిర్వహకులు చిట్టా సాయి బ్రాహ్మణి అందజేశారు . ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటేశ్వర్లు, వల్లెం నరసింహారావు, షేక్ జలీలు, ఉల్లంగుల ప్రసాదు, పింగళి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment