పెనుమర్తిలో జగనన్నే మా భవిష్యత్తు, గడప గడపకూ కార్యక్రమాలు
కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 9: కాకినాడ రూరల్ మండలంలోని పెనుమర్తి గ్రామం లో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొన్నారు. గ్రామంలో వైఎ స్సార్ సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, నాయకులతో కలసి ఇంటింటికీ పర్యటించి ప్రభుత్వ పథకాలు, సీఎం పనితీరు, తదితర వాటిని వివరించి, ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఎన్నికల ముందు పాద యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకొన్నాం.. నవ రత్నాలు పథకాల ద్వారా హామీలు నెరవేర్చాం. సీఎం జగన్ను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు.
అలాగే గడప గడపకుమన ప్రభుత్వంలో భాగంగా కాకినాడ రూరల్ పెనుమర్తిలో శనివారం అధికారులతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకు న్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. గ్రామస్తులు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయం వంటి సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అర్హతే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధిని అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. అనం తరం గ్రామంలో ఎస్సీ సామాజిక భవన నిర్మాణా నికి శంకుస్థాపన చేశారు. నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ కొల్లా బాస్కర్, పెంకే ఆనంద్ కుమార్ వెల్లంకి సత్యవతి, భాస్కర్ రమేష్, పలివెల గోవిందరాజు, సీనియర్ నాయకుడు గోపుశెట్టి బాబీ, తోటకూర శ్రీను, పండూరు ఎంపీటీసీ నందిపాటి శ్రీనివాస్, సొసైటీ అధ్యకుడు సత్తిబాబు, ధర్మరాజు, నం డూరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.