మార్కాపురం సభలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు
అక్టోబర్ నాటికి వెలుగొండ పూర్తి చేస్తాం
మార్కాపురానికి వరాల జల్లులు
మిన్నింటిన ప్రజల హర్షద్వానాల మధ్య ఈ బీసీ నేస్తం రెండవ విడత ప్రారంభం
ఒంగోలు /మార్కాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 12: పెద్దాయన చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బటన్ ఎందుకు నొక్క లేదంటే ఆయన పాలలో దోచుకో, పంచుకో, తినుకో ( డిపిటి పథకాన్ని అమలు చేశారని ) ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైయస్సార్ ఇబిసి నేస్తం రెండవ విడత నిధులు జమ చేసేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ పాలనలో డిబి టి పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామని తెలిపారు ఎటువంటి అవినీతి ఆశ్రిత పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు గడచిన 46 నెలల్లో రాష్ట్రంలో రెండు లక్షల ఏడు వేల కోట్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాకి నేరుగా జమ చేశామని తెలిపారు ఎవరిది సంక్షేమ ప్రభుత్వం? ఎవరిది దోచుకునే ప్రభుత్వం ప్రజలే నిర్ణయించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు.
దాన్నే గొప్ప సెల్ఫీ అంటారు:
సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, గత ప్రభుత్వంలో జరిగిన మంచి, మా పాలనలో జరిగిన మంచిని బేరీజు వేయాలని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతి ఇంటికీ వెళ్లి ఏం చేశారో చెప్పాలని.. ప్రజలు మంచి చేశారని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలని, దాన్నే గొప్ప సెల్ఫీ అంటారని ముఖ్యమంత్రిఅన్నారు. మాజీ సిఎం చంద్రబాబుపై సిఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబును ‘ముసలాయన’ అంటూ సంబోధించారు. గత ప్రభుత్వ హయాంలో డీపీటీ పథకం ఉండేదని.. దాని ఉద్దేశమే దోచుకో, పంచుకో, తినుకో అని జగన్ ఎద్దేవా చేశారు. ముసలాయన ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాల్లో జమ అయ్యిందా? అని ప్రశ్నించారు. డబ్బంతా తన వాళ్లకే దోచిపెట్టారని జగన్ ఆరోపించారు. కాబట్టి ప్రజలు గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి అభివృద్ధిలో సంక్షేమంలో బేరిజు వేసుకొని రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని జగన్ కోరారు రాష్ట్రంలో 45-60 ఏళ్ల లోపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని సీఎం జగన్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలుచేయడం లేదని పేర్కొన్నారు. గడచిన రెండేళ్లలో ఇబీసీ నేస్తం పథకం కింద రూ.12 వందల కోట్లు అందించామని వెల్లడించారు. రాజకీయంగా మహిళల సాధికారికత కోసం అనేక పథకాలు ప్రారంభించామని తెలిపారు :
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు.
మార్కాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తి అయిందని వివరించారు. రెండో టన్నెల్లో 1.8 కి.మీ మేర పనులు ఉన్నాయని, వాటిని ఐదారు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 11 కి.మీ పనులు పూర్తి చేశామని, ఈ ఏడాది అక్టోబర్లోనే ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఐదు కిలోమీటర్లు పని జరిగే టప్పటికి గగనం అయిందని ఆయన అన్నారు.
మీ బిడ్డ జగన్కు మీరే సైనికులుగా మారండి:
రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని, సున్నావడ్డీ పథకాన్ని ఎగ్గొట్టారని సీఎం జగన్ ఆరోపించారు. తాము రైతు భరోసా కింద 53 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అబద్దాలు నమ్మొద్దని, ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోవాలని కోరారు. పచ్చ మీడియా, దత్తపుత్రుడిపై మరోసారి జగన్ మండిపడ్డారు. ఈ బీసీ నేస్తం ఏవీ ని ప్రదర్శించారు.మీ ఇంట్లో మంచి జరిగుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో మీ బిడ్డ జగన్కు మీరే సైనికులుగా మారండి అని జగన్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 45-60 ఏళ్ల లోపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని సీఎం జగన్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలుచేయడం లేదని పేర్కొన్నారు. గడచిన రెండేళ్లలో ఇబీసీ నేస్తం పథకం కింద రూ.12 వందల కోట్లు అందించామని వెల్లడించారు. రాజకీయంగా మహిళల సాధికారికత కోసం అనేక పథకాలు ప్రారంభించామని తెలిపారు.: అకౌంట్లలో డబ్బులు జమ’
వైయస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బును విడుదల చేశారు. ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు పేద మహిళలకు ప్రభుత్వం రూ.15వేల చొప్పున జమ చేసింది. మొత్తం 4,39,068 మంది ఖాతాల్లో రూ.658.60 కోట్లను సాయంగా అందించింది. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి : మార్కాపురం చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు హెలీప్యాడ్ వద్ద జగన్కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్వీకేపీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
జై జగన్, జై జై జగన్ అంటూ.. హోరెత్తిన బహిరంగ సభ
మార్కాపురంలో ఈ బీసీ నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సీఎం జగన్ బహిరంగ సభ వద్దకు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజానీకం జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా బహిరంగ సభ జోహార్ వైయస్ఆర్ అంటూ మారుమోగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీఎంకు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి వినతులివే..
నాలుగేళ్లలో మార్కాపురం నియోజకవర్గానికి రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. ఈబీసీ నేస్తం విడుదల సందర్భంగా జగన్ మార్కాపురం రాగా, ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ మొదలుపెట్టింది వైఎస్ఆర్ అని, జగన్ పూర్తి చేస్తారని తెలిపారు. మార్కాపురంలో షాదీఖానా, అంబేద్కర్ భవన్, బీసీ భవన్, పొదిలిలో మెయిన్ రోడ్డు, డ్రైనేజీల పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. అన్నింటికీ నిధులు కేటాయిస్తున్నామని పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఎలుగొండ ప్రాజెక్టు ప్రారంభించే నాటికి మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కోరారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, సిహెచ్ వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు కే నాగార్జున రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి మద్దిశెట్టి వేణుగోపాల్,అన్నా రాంబాబు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ బీసీ నేస్త మహిళల అనుభవాలను జగన్అడిగి తెలుసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాల శిలాఫలకాలను ఆవిష్కరించారు జిల్లా ఎస్పీ మాలికాగర్గ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు అంతకు ముందు ముఖ్యమంత్రి హెలిపాడ్ వద్ద జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఘన స్వాగతం పలికారు