నెల్లూరు – ఒంగోలు – బాపట్ల తీరాల పైకి విరుచుకుపడనున్న – “మిషంగ్”. నేడు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అతిభారీ నుంచి తీవ్రమైన వర్షాలు.
==========
ప్రస్తుతానికి చెన్నైకి ఆగ్నేయంగా 320 కి.మీ. దూరంలో కొనసాగుతున్న మిషంగ్ తుఫాను ప్రభావం వలన గత 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లల్లో భారీ వర్షాలు నమోదయ్యింది. అత్యథికంగఅ తిరుపతి సిటీలో 138 మిల్లీమీటర్ల అతిభఅరీ వర్షం నమోదవ్వగా నెల్లూరు నగరంలో మాత్రం 65 మిల్లీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యింది.
నేడు సాయంకాలం – రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కొనసీమ, యానం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని అన్ని కోస్తా భాగాల్లో వర్షాలు ఖచ్చితంగా నమోదవుతుంది. గాలులు తప్పకుండా గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకు వీయనుంది. నేడు రాత్రికి చెన్నై పరిసరాలతో పాటుగా సూళూరుపేట, తిరుపతి సిటీ, శ్రీకాళహస్తి, నాయుడూపేట, గూడూరు వైపుగా వర్షాలు అతిభారీగా మారనుంది. అది రేపు ఉదయానికి తీవ్ర స్ధాయిలో నెల్లూరు నగరం వరకు విస్తరించనుంది. నెల్లూరు నగరంతో పాటుగా సింగారాయకొండ, కావలి, వింజమూరు, కృష్ణపట్ణం, ఒంగోలులలో వర్షాల జోరు రేపు (4 డిసెంబర్) సాయంకాలానికి తీవ్ర స్ధాయిలో మారనుంది. డిసెంబర్ 5 తారీకునకి ఎన్.టీ.ఆర్., ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లలలో అతిభారీ – తీవ్రమైన వర్షాలుంటాయి.
ఈ తుఫానులో గాలుల కంటే వర్షాల వలనే ఎక్కువ నష్టం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Source – Ap Weather Man