ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం.
హైదారాబాద్ టూ చీరాల కు వెళ్ళే శ్రీ క్రిష్ణా ట్రావెల్స్ బస్సు లో నల్లగొండ జిల్లా మర్రి గూడ బైపాస్ దగ్గర తెల్లవారు జామున 2 గంటల సమయం లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సు లో మొత్తం 34 మంది ప్రయనించగా అందులో ఒకరు సజీవ దహనమాయ్యారు. స్లీపర్ క్లాస్ కోచ్ అవ్వటం వలన ఆ వ్యక్తి చనిపోయాడని తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి ఎముకులు గుర్తించారు. మిగతా ప్రయాణికులుకు చిన్న గాయాలే తప్ప ప్రమాదం ఏమీ లేదని, ఈ ప్రమాదం లో ప్రయాణికుల లగేజ్ , బంగారంతో పాటు అమెరికా వెళ్ళాలనే అమ్మాయి వీసా కూడా దగ్ధం అయ్యింది అని చెప్పారు. ఈ ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.