తెలంగాణ మేరు జేఏసీ ప్రభుత్వానికి వినతి.
ఎల్బీనగర్, ఇంచార్జ్, జనసేన, ఏప్రిల్ 07:
మేరు కులస్తుల వృత్తిపరమైన జన్మహక్కు దర్జీ వృత్తిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ మేరు ఐకాస విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ వివిధ శాఖల్లో ఏకరూప వస్తువుల టెండర్లను ప్రభుత్వ కుట్టుపని టెండర్స్ పూర్తి గా మేర కులస్తులకే కేటాయించాలని తెలంగాణ మేరు ఐకాస కన్వీనర్, చైర్మన్ మునగాల రాము ప్రభుత్వాన్ని కి విన్నవించారు. హైదరాబాద్ ఎల్. బి నగర్ లో మేర జేఏసీ కన్వీనర్, చైర్మన్ మునిగాల రాము అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మేర జేఏసీ నాయకులు మాట్లాడుతూ..
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే మేర కుల వృత్తిదారులకు నిధులు నియామకాలు లభిస్తా యని భావించి తెలంగాణ ఉద్యమంలో కుట్టు మిషన్లు రోడ్డున వేసుకొని ప్రత్యేక తెలం గాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డిన తర్వాత పది సంవత్సరా లు మేర కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్ పనులు లేక లక్షలాది మేర టైలర్ కార్మికులు వలస వెళ్లాల్సి వచ్చి దుర్భర జీవితాలు గడపాలని వాపోయారు. గత రాష్ట్ర ప్రభు త్వం మేర కులస్తులను గుర్తించ లేదని స్కూల్ యూనిఫాo కేవలం 30 శాతం మాత్రమే కేటాయించిందని టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎన్నోసార్లు నిరసన తెలిపి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం జరిగింద న్నారు.
దీని ఫలితంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఉప్పల్ బగాయత్ లోని ఎకరం భూమి, రూ.కోటి నిధితో మేర బీసీ ఆత్మ గౌరవ భవనాన్ని ఏర్పాటు చేసి మేర బంధువులకు కూడా బిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇచ్చిందన్నారు. అదేవిధంగా గత ఎన్నికలలో రాష్ట్రంలో ఉ న్నటువంటి మేర కులస్తుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే మేర కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేర కుల నాయకులు ఉమ్మడిగా ప్రభుత్వానికి కృతజ్ఞత సమా వేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సంబరాలు చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్య ప్రభుత్వ కుట్టు పనుల టెండర్లు అన్నీ కూడా డ్వాక్రా మహిళా గ్రూపులకు ఇస్తున్నామని ఒక ప్రకటన చేశారని అన్నారు. అది మా మేర కులస్తుల వృత్తికి, ఉనికికి, తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేర కులస్తుల తరఫున ప్రభుత్వ కుట్టు మిషన్ టెండర్లు అన్నీ కూడా మేర కార్పొరేషన్ ద్వారానే మేర కులస్తులకు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నట్లు జేఏసీ కన్వీనర్ వెల్లడించారు.
ప్రియతమ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న మేర కులస్తుల వృత్తిని కాపాడటానికి వివిధ సంక్షేమ పథకాలతో పాటుగా, ప్రభుత్వ కుట్టు పనులన్నీ కూడా మేర కార్పొరేషన్ ద్వారా మేర కులస్థులకి కేటాయించా లని తెలంగాణ మేర జేఏసీ విన్నవించుకుంటుందని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేరకులస్తులు అండగా ఉంటారని.. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మేర జేఏసీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం సమావేశంలో మేర జేఏసీ సభ్యులైన ముఖ్య సలహాదారుడు మునిగాల రమేష్, కన్వీనర్లు మెడిగ సంతోష్ ,మాడిశెట్టి ఆనందం, మాశెట్టి వెంకటేశం, డాక్టర్ పద్మనాభం , మరిశెట్టి యాదగిరి, బోనగిరి చంద్రశేఖర్, తాళ్ల నరసింహులు, మేడిగ రాంబాబు మాట్లాడుతూ.. పూర్వీకుల నుంచి అనాదిగా, వారసత్వంగా దర్జీ వృత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులు కబ్జాలకు గురి కావడం వల్ల జీవనోపాధి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునిగే నక్క పై తాటి పండు పడిన చందంగా మేరు కులస్తుల జీవనం దుర్భరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కులాలను ఆదుకోవాలని.. ప్రభుత్వ టెండర్లను 100% మేరు కులస్తులకే కేటాయించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.